‘L2: ఎంపురాన్’ బాక్సాఫీస్‌ సునామీ!

'L2: ఎంపురాన్' మలయాళ సినిమాకి కొత్త రికార్డులను నమోదు చేస్తూ, బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్'కి సీక్వెల్‌గా వచ్చింది.;

By :  S D R
Update: 2025-04-01 01:31 GMT

'L2: ఎంపురాన్' మలయాళ సినిమాకి కొత్త రికార్డులను నమోదు చేస్తూ, బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్'కి సీక్వెల్‌గా వచ్చింది.

మార్చి 27న విడుదలైన ఈ చిత్రం, వారం పూర్తికాకముందే రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న సినిమా ఇదే. విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుకున్న 'ఎంపురాన్' మొదటి షో నుంచే వసూళ్ల వర్షం కురిపించింది.. ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డులు నెలకొల్పింది. వీకెండ్‌లో హాలిడేస్ కలిసి రావడంతో, కలెక్షన్లు అద్భుత స్థాయిలో పెరిగాయి.

ఈ సినిమా కంటెంట్‌ పరంగా వివాదాలు చుట్టుముట్టినా కలెక్షన్లలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది. గతంలో రూ.240 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రంగా 'మంజుమ్మెల్ బాయ్స్' ఉంది. ఇప్పుడు ఆ రికార్డును 'ఎంపురాన్' త్వరలోనే బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తే 'ఎంపురాన్' మలయాళ సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News