యశ్ పై ‘టాక్సిక్’ యాక్షన్ డైరెక్టర్ ప్రశంసలు !

Update: 2025-03-14 08:01 GMT

యశ్ పై ‘టాక్సిక్’ యాక్షన్ డైరెక్టర్ ప్రశంసలు !‘కేజీఎఫ్’ ఫేమ్ కన్నడ రాక్ స్టార్ యశ్, టాలెంటెడ్ యలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో పాన్-ఇండియా చిత్రం టాక్సిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించి.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకి డబ్బింగ్ చేయనున్నారు. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

హాలీవుడ్‌లో “అవతార్,” “ఎఫ్9” వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్స్ అందించిన ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ జె.జె. పెర్రీ.. ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేయడం విశేషం. అతడు ఈ సినిమా కోసం యష్‌తో కలిసి కొన్ని యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసిన అనంతరం అతడిపై ప్రశంసలు కురిపించాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో యష్‌తో కలిసి ఒక ఫోటోను పంచుకున్న పెర్రీ, “నా స్నేహితుడు యశ్ తో ‘టాక్సిక్’ చిత్రంపై వర్క్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఇండియాలో గొప్ప అనుభవాన్ని పొందాను. యూరప్ నుంచి వచ్చిన నా స్నేహితులతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది. అందరూ దీన్ని ఆస్వాదించగలుగుతారని ఆశిస్తున్నా. ఈ ప్రాజెక్టుపై గర్వంగా ఉంది” అని పేర్కొన్నాడు. దీనికి స్పందించిన యశ్ .. “నా మిత్రమా, మీతో పని చేయడం నిజంగా ఓ ఎనర్జీ అని సమాధానమిచ్చాడు.

Tags:    

Similar News