‘టాక్సిక్’ షూటింగ్ లో జాయిన్ అయిన నయనతార !

ఇటీవల గోవాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన దర్శకురాలు గీతూ మోహన్ దాస్, ఇప్పుడు షూటింగ్‌ను బెంగళూరుకు మార్చింది. ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రస్తుతం కొన్ని ముఖ్య ఘట్టాలను చిత్రీకరిస్తోంది.;

By :  K R K
Update: 2025-02-05 01:01 GMT

'కేజీఎఫ్' ఫేమ్ కన్నడ సూపర్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ మూవీ 'టాక్సిక్'. ఈ మూవీ షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఇటీవల గోవాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన దర్శకురాలు గీతూ మోహన్ దాస్, ఇప్పుడు షూటింగ్‌ను బెంగళూరుకు మార్చింది. ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రస్తుతం కొన్ని ముఖ్య ఘట్టాలను చిత్రీకరిస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వాని ప్రధాన కథానాయికగా నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్  నయనతార మరో కీలక పాత్రలో కనిపించనుంది. అయితే.. నయనతార పాత్ర యశ్‌కి ప్రేమికురాలిగా కాకుండా పూర్తిగా విభిన్నంగా ఉంటుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటీమణులు హూమా ఖురేషి, తారా సుతారియాలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నయనతార, కియారా అద్వాని, హూమా ఖురేషి, తారా సుతారియా తదితరులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 'టాక్సిక్' ను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నట్టు చిత్ర బృందం వర్ణిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభూతిని అందించబోతుందని అంటున్నారు.

ఈ సినిమాను వేంకట్ కె. నారాయణ, యశ్ కలిసి కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ‘టాక్సిక్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. మరి ఈ సినిమా యశ్ కు ఏ రేంజ్ లో సక్సె్స్ ను ఇస్తుందో చూడాలి. 

Tags:    

Similar News