కన్నడ సినిమాలకు ప్రభుత్వం భరోసా!

Update: 2025-03-07 10:58 GMT

కన్నడ సినీ పరిశ్రమకు కీలకమైన అనేక నిర్ణయాలతో కర్ణాటక ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. థియేటర్లలో టిక్కెట్ ధరలను రూ.200కి పరిమితం చేయడం, కన్నడ సినిమాలను ప్రోత్సహించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయడం వంటి చర్యలను ప్రకటించారు.

సినీ రంగానికి ఇండస్ట్రీ హోదా కల్పిస్తూ, ప్రభుత్వ సౌకర్యాలు వర్తింపజేయనున్నారు. ప్రముఖ కన్నడ సినీ నటులు, నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అవకాశాల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో, ప్రభుత్వం ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక రిపోజిటరీను ఏర్పాటుచేస్తోంది.

అంతేగాక, 2.5 ఎకరాల భూమిలో మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ నిర్మాణం, మైసూరులో రూ.500 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు వంటి ప్రాజెక్టులను PPP మోడల్‌లో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలు కన్నడ చిత్రపరిశ్రమకు కొత్త మార్గాలు సృష్టించనున్నాయి.

Tags:    

Similar News