‘బిల్లా రంగా భాషా’ షూటింగ్ ప్రారంభం !
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ సాగా ‘బిల్లా రంగ బాషా’. దీన్ని షార్ట్ కట్ లో బీఆర్బీ ఫస్ట్ బ్లడ్ అని ఫిక్స్ చేశారు.;
మైథలాజికల్ ఎపిక్ ‘హను-మాన్’ భారీ విజయాన్ని సాధించిన అనంతరం.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ తమ తదుపరి యాంబిషియస్ ప్రాజెక్టును ప్రకటించింది. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ సాగా ‘బిల్లా రంగ బాషా’. దీన్ని షార్ట్ కట్ లో బీఆర్బీ ఫస్ట్ బ్లడ్ అని ఫిక్స్ చేశారు.
ఈ చిత్రాన్ని అధికారికంగా 2024 సెప్టెంబర్ 2న ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా.. ఈ రోజు నుండి షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ.. అభిమానులతో ఈ ఉత్సాహకరమైన విషయాన్ని పంచుకున్నారు.
ఈ కథ 2209 ఎ.డి లో నడిచే పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. హై-ఓక్టేన్ యాక్షన్‌తో కూడిన ఈ డ్రామా బహుభాషల్లో విడుదల కానుంది. ‘విక్రాంత్ రోణా’ చిత్రానికి దర్శకత్వం వహించిన అనూప్ భండారి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. సుదీప్‌తో ఆయన రెండో సినిమా ఇది.
ఈ భారీ ప్రాజెక్టును కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో, ఉత్కంఠభరితమైన కథనంతో ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుంది. మరి ఈ సినిమా సుదీప్ కు ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.