శాండల్ వుడ్ నుంచి మరో విజువల్ వండర్

కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న రాజ్ బి. శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ఆ చిత్రం ‘45’.;

By :  K R K
Update: 2025-04-17 03:47 GMT

ఒకప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. తెలుగు, తమిళ చిత్రాల రీమేక్‌లే ఎక్కువగా వుండేవి. కంటెంట్ పరంగా, మార్కెట్ పరంగా కూడా కన్నడ సినిమా చాలా వెనుకబడ్డ పరిస్థితిలో ఉండేది. కానీ గత పదేళ్లలో శాండిల్‌వుడ్ అద్భుతమైన మార్పు చూసింది. ప్రపంచ సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.

'కేజీఎఫ్', 'కాంతారా', 'గరుడ గమన', 'చార్లీ 777', ' గరుడగమన వృషభ వాహన' వంటి సినిమాలతో కన్నడ పరిశ్రమ సరికొత్త స్టాండర్డ్స్ నెలకొల్పింది. కమర్షియల్‌గా కూడా కన్నడ సినిమా రీచ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అదే కోవలో మరో సెన్సేషనల్ మూవీ వస్తోంది.

కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న రాజ్ బి. శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ఆ చిత్రం ‘45’. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టీజర్‌లో కథ స్పష్టంగా తెలియనప్పటికీ. విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్.

"మనిషి చనిపోయాక ప్రేమ చూపడం కంటే, బతికుండగానే ప్రేమ చూపితే బాగుంటుంది" అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. రాజ్ బి. శెట్టి పాత్ర సినిమాకు హార్ట్ అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ఉపేంద్ర, శివరాజ్ కుమార్ విభిన్నమైన గెటప్స్‌లో ఆకట్టుకున్నారు. టీజర్‌లో "ఈ చిత్రానికి దర్శకుడు నేను" అని ఉపేంద్ర చెప్పగా.. వెంటనే "ఈ చిత్రానికి హీరో నేను" అంటూ శివన్న ఇచ్చిన కౌంటర్ డైలాగ్, సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేసింది.

ఇదే ఉపేంద్ర సినిమాలకు ప్రత్యేకత. కథాబాహ్యంగా ప్రోమోలు రూపొందించి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచడం. ఇప్పుడు అర్జున్ సన్య దర్శకత్వంలో రూపొందుతున్న '45' మూవీ కూడా అదే తరహాలో కనిపిస్తోంది. ట్రైలర్ వచ్చాకా కథ గురించి మరింత క్లారిటీ వస్తుంది. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. శాండిల్‌వుడ్లో నుంచి మరో ప్రత్యేకమైన సినిమా జాబితాలో చేరబోతోంది ‘45’.

Tags:    

Similar News