‘టాక్సిక్’ మ్యూజిక్ డైరెక్టర్ ఇతడేనా?

తమిళ టాప్ కంపోజర్ అనిరుద్ ఈ ప్రాజెక్ట్‌లో సైన్ చేశాడు. అనిరుద్ పలు తమిళ, తెలుగు సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నప్పటికీ, 'టాక్సిక్' కథతో ఇంప్రెస్ అయి ఈ సినిమాని ఒప్పుకున్నాడు.;

By :  K R K
Update: 2025-07-07 01:25 GMT

‘కేజీఎఫ్’ స్టార్ యశ్... ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ సూపర్ హిట్ తర్వాత రెండేళ్ల పాటు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం అతను 'టాక్సిక్' అనే యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఆలస్యమైంది. ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. సినిమాకి సరైన మ్యూజిక్ డైరెక్టర్ కోసం టీమ్ ఎంతో శ్రమించింది.

తాజా బజ్ ప్రకారం.. తమిళ టాప్ కంపోజర్ అనిరుద్ ఈ ప్రాజెక్ట్‌లో సైన్ చేశాడు. అనిరుద్ పలు తమిళ, తెలుగు సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నప్పటికీ, 'టాక్సిక్' కథతో ఇంప్రెస్ అయి ఈ సినిమాని ఒప్పుకున్నాడు. ఈ చిత్రం అనిరుధ్ కి కన్నడ సినిమా రంగంలో తొలి అడుగు.

'టాక్సిక్' తెలుగు, కన్న ­­­­­­­­కన్నడ భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్నారు, ఆ తర్వాత హిందీ, తమిళం, మలయాళంలో డబ్ చేస్తారు. ఈ సినిమాకి గీతూ మోహన్‌దాస్ దర్శకురాలు, కేవీయన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. 

Tags:    

Similar News