జలియన్ వాలాబాగ్ కథతో ‘కేసరి 2‘

‘కేసరి ఛాప్టర్ 2‘.. బ్రిటీష్ పాలనలో జరిగిన దారుణ మారణకాండ జలియన్ వాలాబాగ్ ఇతివృత్తంతో రూపొందింది. జలియన్ వాలా బాగ్ ఘోర మారణకాండ జరిగిన తర్వాత ఆ కేసును వాదించే క్రమంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.;

By :  S D R
Update: 2025-04-03 10:41 GMT

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి‘ ఘన విజయాన్ని సాధించింది. 2019లో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అప్పట్లోనే రూ.200 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. అదే టైటిల్ తో ‘కేసరి ఛాప్టర్ 2‘ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్‘ అనేది ట్యాగ్ లైన్.

మాధవన్, అనన్య పాండే ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘కేసరి ఛాప్టర్ 2‘.. బ్రిటీష్ పాలనలో జరిగిన దారుణ మారణకాండ జలియన్ వాలాబాగ్ ఇతివృత్తంతో రూపొందింది. జలియన్ వాలా బాగ్ ఘోర మారణకాండ జరిగిన తర్వాత ఆ కేసును వాదించే క్రమంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

లేటెస్ట్ గా ‘కేసరి ఛాప్టర్ 2‘ ట్రైలర్ రిలీజయ్యింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మాధవన్ ఇద్దరూ లాయర్ల పాత్రల్లో కనిపిస్తున్నారు. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ నిర్మించాడు. ఏప్రిల్ 18న ‘కేసరి ఛాప్టర్ 2‘ విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News