‘కాంతార‘ ఫస్ట్ డే కలెక్షన్స్

బ్లాక్‌బస్టర్ ‘కాంతార‘కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1‘ దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది.;

By :  S D R
Update: 2025-10-03 11:56 GMT

బ్లాక్‌బస్టర్ ‘కాంతార‘కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1‘ దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. బుక్ మై షోలో ఒక్క రోజులోనే 1.28 మిలియన్ టికెట్లు అమ్ముడవడం రికార్డ్.

పాజిటివ్ మౌత్‌టాక్‌తో సినిమాకు డిమాండ్ పెరుగుతూ అనేక ప్రాంతాల్లో షోలు పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్స్‌తో సందడి చేస్తుండగా, అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో పెరిగాయి. వీకెండ్‌లో మరింత భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగులో ‘కాంతార చాప్టర్ 1‘ హవా వల్ల పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది.


Tags:    

Similar News