'కన్నప్ప' నుంచి 'శివ శివ శంకరా'!

Update: 2025-02-10 13:41 GMT

విష్ణు మంచు 'కన్నప్ప' ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజవ్వగా.. లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ 'శివ శివ శంకరా'ను విడుదల చేశారు. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ లో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించాడు.



Full View


ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో శివ భక్తుడు కన్నప్పగా విష్ణు అలరిస్తున్నాడు. శివుడి నామస్మరణతో తనకు తోచిన రీతిలో శివ లింగాన్ని పూజిస్తూ ఆయన నామస్మరణతో లోకాన్ని మైమరచిపోయే భక్తుడిగా విష్ణు కనిపిస్తున్నాడు.

పురాణ కథతో ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణుకి జోడీగా ప్రీతి ముకుందన్ నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు వంటి వారు కనిపించనున్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో వేసవి కానుకగా 'కన్నప్ప' విడుదలకు ముస్తాబవుతుంది.

Tags:    

Similar News