ప్రచారంలో స్పీడు పెంచిన ‘కన్నప్ప‘
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన పాన్-ఇండియా మూవీ ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్ ను జోరుగా నిర్వహిస్తున్నాడు విష్ణు.;
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన పాన్-ఇండియా మూవీ ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్ ను జోరుగా నిర్వహిస్తున్నాడు విష్ణు.
ఆమధ్య అమెరికాలో ‘కన్నప్ప‘ని ప్రమోట్ చేసిన విష్ణు.. ఇటీవల వరుసగా చెన్నై, బెంగళూరులలో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించాడు. ఇక ఈ చిత్రం విడుదలకు 25 రోజులు మాత్రమే ఉండడంతో మిగతా పాన్ ఇండియాలోని సిటీలను కవర్ చేయబోతుంది ‘కన్నప్ప‘ టీమ్.
త్వరలో ఇండోర్ లో ట్రైలర్ లాంఛ్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ మూవీలో శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈనేపథ్యంలో బాలీవుడ్ మీడియా కోసం అక్షయ్ ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నాడట.
కేరళ ఆడియన్స్ కోసం ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించిన మోహన్ లాల్ తో మరో మీడియా మీట్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందట టీమ్. ఇంకా రెబెల్ స్టార్ ప్రభాస్ తో పాటు మిగతా చిత్రబృందంతోనూ ఓ ప్రమోషనల్ ఇంటర్యూ ప్లాన్ చేయాలనే ఆలోచనలోనూ విష్ణు ఉన్నట్టు తెలుస్తోంది.