'కన్నప్ప' కొత్త విడుదల తేదీ!
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. అసలు ఈ నెలలోనే విడుదవ్వాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే.;
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. అసలు ఈ నెలలోనే విడుదవ్వాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా 'కన్నప్ప' కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ మూవీని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం విశేషం. యు.పి.ముఖ్యమంత్రిని మంచు మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా మర్యాదపూర్వకంగా కలవడం ద్వారా ఈ సినిమా ప్రచారం మరో స్థాయికి చేరింది.
ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది.