'కన్నప్ప' సెన్సార్ రిపోర్ట్!
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’. జూన్ 27న విడుదలకు ముస్తాబైన 'కన్నప్ప' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.;
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’. జూన్ 27న విడుదలకు ముస్తాబైన 'కన్నప్ప' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ తర్వాత సినిమా రన్‌టైమ్ 182 నిమిషాలుగా (3 గంటల 2 నిమిషాలు) ఖరారైంది.
మొదట సినిమాను 195 నిమిషాల నిడివితో రూపొందించగా, సెన్సార్ బోర్డు సూచించిన 12 కట్స్‌ను చిత్ర బృందం అంగీకరించింది. తొలగించిన సన్నివేశాల్లో ఓ చిన్నారిపై రాబందు దాడి దృశ్యం, తిన్నడుకు సంబంధించిన కొన్ని సీన్లు, మూడు పాటల్లోని కొన్ని విజువల్స్ ఉన్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, కథను మంచు విష్ణు స్వయంగా రాశారు. ‘భక్త కన్నప్ప’ (కృష్ణంరాజు) చిత్రం తర్వాత దాదాపు 50 ఏళ్లకు మళ్లీ కన్నప్ప కథ వెండితెరపైకి రాబోతుండటం విశేషం.
ఈ చిత్రంలో మంచు విష్ణు తిన్నడు అలియాస్ కన్నప్పగా, ప్రభాస్ రుద్రుడిగా, మోహన్‌లాల్ కిరాత వేషంలో, అక్షయ్‌కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, మోహన్‌బాబు మహదేవ శాస్త్రిగా కీలక పాత్రలు పోషించారు.
తెలుగు వెర్షన్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు నుండి ప్రారంభం కానున్నట్లు విష్ణు స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కి వచ్చిన స్పందనతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.