చివరికి న్యాయం గెలిచింది: శింగనమల రమేష్ బాబు

Update: 2025-02-05 09:09 GMT

నాపై తప్పుడు కేసులు బనాయించి నన్ను 14 సంవత్సరాలు మానసిక క్షోభకు గురి చేశారు, కానీ చివరకు తప్పుడు కేసులు న్యాయం ముందు గెలవలేకపోయాయి.నేను ఇంత కష్ట కాలంలో వున్నపుడు నా అనుకున్న వాళ్ళు కానీ,ఇండస్ట్రీ తరుపున కానీ ఎవరూ కూడా నన్ను పలకరించిన వాళ్ళు లేరు.ఎవరు నాతో వున్న లేకపోయినా చివరికి న్యాయం గెలిచింది అని నేను గట్టిగా నమ్ముతున్నాను.


14 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించినప్పటికి సినిమా పై నా ఆలోచన మారలేదు.అనుక్షణం సినిమా గురించి ఆలోచిస్తూనే ఉన్నాను.ఇన్ని సంవత్సరాలు నేను చాలా కోల్పోయాను..ఇక నుంచి నా సినీ ప్రస్థానాన్ని మళ్ళీ మొదలు పెడతాను.నేను నేర్చుకున్న గుణపాఠం ఒక్కటే 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన వుంటేనే సినిమా తీయాలి.నేను కష్టాల్లో వున్నప్పుడు నాకు తోడుగా వున్నంది ఒక్క భగవంతుడు మాత్రమే.

Tags:    

Similar News