డ్యాన్స్, ఫైట్స్ లో అదరగొడుతున్న 'జూనియర్'!
ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'జూనియర్'. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.;
ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'జూనియర్'. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది.
కాలేజ్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ టీజర్.. ఫ్రెండ్‌షిప్, ఫన్, లవ్, యాక్షన్ అన్నీ రంగరించి ఓ ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనింగ్ ప్యాకేజీలా ఉంది. హీరోహీరోయిన్లుగా కిరీటి, శ్రీలీల పెయిర్.. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష.. కీలక పాత్రలో జెనీలియా ఆకట్టుకుంటున్నారు.
'జూనియర్' మూవీకి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హైన్ స్టంట్స్ ఈ మూవీకి టెక్నికల్ గా ప్లస్ పాయింట్స్. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో జూలై 18న విడుదలకు ముస్తాబవుతుంది.