జాకీ చాన్ కొత్త చిత్రం షూటింగ్ పూర్తి !
ఇందులో జాకీ చాన్ మకావ్ పోలీస్ సర్వీస్‌లో పని చేసిన పర్యవేక్షణ నిపుణుడు హువాంగ్ డె జోంగ్ పాత్రలో కనిపించనున్నాడు.;
వరల్డ్ ఫేమస్ యాక్షన్ హీరో.. జాకీ చాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ "ది షాడోస్ ఎడ్జ్". ఈ చిత్రానికి సంబంధించి ప్రధాన చిత్రీకరణ పూర్తయింది. ఇందులో జాకీ చాన్‌తో కలిసి సెవెంటీన్ సభ్యుడు జూన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. "రైడ్ ఆన్" చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు లారీ యాంగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జాంగ్ జీ ఫెంగ్ , టోనీ లియాంగ్, కా ఫై వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.
ఈ నెల ప్రారంభంలో విడుదలైన ఫస్ట్ పోస్టర్ జాకీ చాన్ అండ్ జూన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. జనవరి 18న జూన్ తన సోషల్ మీడియా ద్వారా జాకీ చాన్‌తో కలిసి ఉన్న సెట్స్‌లోని ఫోటోలను షేర్ చేశాడు. అవి అభిమానులను మరింత ఉత్సాహపరిచాయి.
తాజా సమాచారం ప్రకారం, "ది షాడోస్ ఎడ్జ్" కథా నేపథ్యం మకావ్‌లో జరుగుతుంది. ఇందులో జాకీ చాన్ మకావ్ పోలీస్ సర్వీస్‌లో పని చేసిన పర్యవేక్షణ నిపుణుడు హువాంగ్ డె జోంగ్ పాత్రలో కనిపించనున్నాడు. ఓ దొంగల ముఠాను పట్టుకోవడానికి అతను మళ్లీ నియమించబడతాడు. ఈ ప్రోసెస్ లో, అతను క్రిమినల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యంగ్ టాలెంట్స్ బృందంతో కలిసి పని చేస్తాడు.
2023లో విడుదలైన "రైడ్ ఆన్" చిత్రంతో జాకీ చాన్ అండ్ లారీ యాంగ్ కలిసి పనిచేశారు. ఆ చిత్రం జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ చిత్రంగా నిలిచింది. మలేసియాలో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 చైనీస్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. "ది షాడోస్ ఎడ్జ్" చిత్ర విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ సినిమా జాకీచాన్ కు ఇంకే రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.