‘జాక్‘ టీజర్.. సీక్రెట్ మిషన్ తో వస్తోన్న సిద్ధు!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‘. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా ‘బేబి‘ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈరోజు సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే స్పెషల్ గా ‘జాక్‘ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.;

By :  S D R
Update: 2025-02-07 13:07 GMT

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‘. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా ‘బేబి‘ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తుంది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే స్పెషల్ గా ‘జాక్‘ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

‘జాక్.. కొంచెమ్ క్రాక్, బట్ అదేంటో అడగొద్దు ఇట్స్ కాన్ఫిడెన్సియల్‘ అంటూ ఈ మూవీ టైటిల్ లోనే సినిమా కాన్సెప్ట్ ను చెప్పేశారు. అంటే అందరికీ పనీ పాటా లేకుండా కనిపించే ఓ యువకుడి పాత్రలో సిద్ధు కనిపిస్తున్నాడు. కానీ అతను ఏదో సీక్రెట్ మిషన్ చేస్తున్నట్టు, దానికోసం ఎంతో రిస్క్ కూడా చేసినట్టు టీజర్ లో చూపించారు.

మొత్తంగా సిద్ధు తరహా పంచెస్, కామెడీ టైమింగ్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ‘జాక్‘ రాబోతున్నట్టు అర్థమవుతుంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య సైతం పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో మెరవబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News