‘జాట్‘ రెండు రోజుల వసూళ్లు!

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ తో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘‘జాట్‘.;

By :  S D R
Update: 2025-04-12 11:47 GMT

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ తో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘‘జాట్‘. ఈ సినిమాను టాలీవుడ్ బడా సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మించాయి. మాస్ మసాలా యాక్షన్ స్టైల్‌ తో ఏప్రిల్ 10న ఈ సినిమా బాలీవుడ్ లో బడా స్థాయిలో రిలీజయ్యింది.

ఫస్ట్ డే పాజిటివ్ టాక్‌తో పాటు బాలీవుడ్‌లోనే రూ.11.6 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా మంచి మౌత్ టాక్‌తో కొనసాగి, రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.20.1 కోట్లు వసూళ్లు రాబట్టింది. శనివారం, ఆదివారం వీకెండ్‌లో మరింతగా ‘జాట్‘ వసూళ్లు పుంజుకుంటాయని భావిస్తున్నాయి నిర్మాణ సంస్థలు.

తెలుగు సినిమాల్లోని మాస్ స్టైల్ ను బాలీవుడ్ ఆడియన్స్‌కి కనెక్ట్ చేసే ప్రయత్నాన్ని ‘జాట్‘ మూవీతో చేశాడు డైరెక్టర్ మలినేని గోపీచంద్. సన్నీ డియోల్ 'గదర్-2' లాంటి భారీ హిట్స్‌తో పోల్చితే ఈ వసూళ్లు తక్కువైనా, ఇది సన్నీ డియోల్ కోసం కొత్తగా డిజైన్ చేసిన మాస్ ఎంటర్టైనర్‌గా నిలిచింది. మరి.. లాంగ్ రన్ లో ‘జాట్‘ ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Tags:    

Similar News