రీరిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ అదరగొడుతోంది !
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ చిత్రం 1 లక్ష టిక్కెట్లను దాటేసింది. ఇంకా 10 రోజులు సమయం ఉండగా.. ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.;
హాలీవుడ్ దిగ్దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దశాబ్దకాలపు గొప్ప చిత్రాల్లో ఒకటైన చిత్రం ‘ఇంటర్ స్టెల్లార్’. ఈ మూవీ ఇండియాలో రెండోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాథ్యూ మెక్‌కానహే, అన్న్ హథవే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ రీ-రిలీజ్‌కు ముందు నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ చిత్రం 1 లక్ష టిక్కెట్లను దాటేసింది. ఇంకా 10 రోజులు సమయం ఉండగా.. ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం ఐమాక్స్, ఇతర ప్రీమియం ఫార్మాట్‌లలో మాత్రమే విడుదల అవుతోంది. సాధారణ ఫార్మాట్‌లలో కూడా విడుదల చేస్తారేమో చూడాలి.
ఇండియాలో క్రిస్టఫర్ నోలన్ ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమాకు ఉన్న ఆదరణ మరోసారి అద్భుతమైన అడ్వాన్స్ సేల్స్ ద్వారా నిరూపితమైంది. ఈ చిత్రం తొలి వీకెండ్‌లోనే బంపర్ ఓపెనింగ్ సాధించడంతో పాటు వారాంతంలోనూ భారీ కలెక్షన్లు నమోదు చేస్తుందని అంచనా. కొన్ని థియేటర్లు ఇప్పటికే 24 గంటలు ప్రదర్శనల కోసం ప్లాన్ చేస్తుండగా.. మరికొన్ని త్వరలో ఈ జాబితాలో చేరే అవకాశముంది.
‘ఇంటర్ స్టెల్లార్’ చిత్రం 2016లో ఇండియాలో విడుదలైనప్పుడు రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈసారి రీ-రిలీజ్ ద్వారా ఆ రికార్డును దాటాలని చిత్రబృందం ఆశిస్తోంది. 2000 తర్వాత ఇండియన్ బాక్సాఫీస్‌లో రీ-రిలీజ్‌గా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం ‘తుంబాడ్’ (రూ. 38 కోట్లు). హాలీవుడ్ సినిమాల విభాగంలో ‘అవతార్’ (రూ. 10 కోట్లు), ‘టైటానిక్’ (రూ. 18 కోట్లు) రికార్డులను బ్రేక్ చేయడం ‘ఇంటర్ స్టెల్లార్’కు సులభమేనని అంచనా. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. అదే రోజున హిమేష్ రేషమియా ‘బాడాస్ రవికుమార్’, జునైద్ ఖాన్ ‘లవేయపా’ సినిమాలతో పోటీ పడనుంది.