బన్నీ-త్రివిక్రమ్ కలయికలో 'గాడ్ ఆఫ్ వార్'?

ఇప్పటివరకూ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా వచ్చాయి. అయితే ఈసారి సోషియో ఫాంటసీ జానర్ లో బన్నీ సినిమాకోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట త్రివిక్రమ్.;

By :  S D R
Update: 2025-01-27 15:52 GMT

'పుష్ప 2' తో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన అల్లు అర్జున్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. గతంలో బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో 'అల.. వైకుంఠపురములో' వంటి ఆల్‌టైమ్ హిట్ అందించిన గీతా ఆర్ట్స్, హారిక-హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


ఇప్పటివరకూ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాలు ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా వచ్చాయి. అయితే ఈసారి సోషియో ఫాంటసీ జానర్ లో బన్నీ సినిమాకోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట త్రివిక్రమ్. ఈ స్టోరీలో శివుడు, కార్తికేయ వంటి మైథలాజికల్ టచ్ కూడా ఉండబోతుందట. ఈ మూవీకోసం ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.


ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ముహూర్తం, షూటింగ్ వంటి అప్డేట్స్ ను త్వరలోనే అందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.


Tags:    

Similar News