సరికొత్తగా ‘రావు బహదూర్‘ టీజర్
టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్ గా ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు సత్యదేవ్. ఈమధ్య ఎక్కువగా క్యారెక్టర్స్ లో అలరిస్తున్న సత్యదేవ్.. ఇప్పుడు టైటిల్ రోల్ లో కనిపించబోతున్న చిత్రం ‘రావు బహదూర్‘.;
టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్ గా ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు సత్యదేవ్. ఈమధ్య ఎక్కువగా క్యారెక్టర్స్ లో అలరిస్తున్న సత్యదేవ్.. ఇప్పుడు టైటిల్ రోల్ లో కనిపించబోతున్న చిత్రం ‘రావు బహదూర్‘. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి టీజర్ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ‘రావు బహదూర్‘ టీజర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఫాంటసీ టచ్‌తో సాగే సైకలాజికల్ డ్రామాగా ఈ టీజర్ ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాను ‘కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య‘ లాంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నాడు. ఆయనకీ, సత్యదేవ్‌కీ ఇది రెండో కాంబినేషన్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాని శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరో విశేషమమేటంటే ఈ మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండటం. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.