అజిత్ సినిమాకి ఇళయరాజా లీగల్ నోటీసులు

కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకుంది. కారణం – ఇళయరాజా ఇచ్చిన లీగల్ నోటీసులు.;

By :  S D R
Update: 2025-04-15 12:03 GMT

కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకుంది. కారణం – ఇళయరాజా ఇచ్చిన లీగల్ నోటీసులు. ఈ సినిమాకోసం తన అనుమతి లేకుండా గతంలో తాను స్వరపరిచిన మూడు ప్రఖ్యాత పాటలను మళ్లీ రీక్రియేట్ చేసి వాడారని, దీంతో తన కాపీరైట్ హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఇళయరాజా ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఆయన చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించి, రూ. 5 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆ మూడు పాటలను వెంటనే సినిమా నుంచి తొలగించాల్సిందిగా, అలాగే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌ను కూడా ఆయన ఉద్ఘాటించారు.

ఇళయరాజా గతంలోనూ తన పాటలను అనుమతి లేకుండా వాడుకున్న వారిపై ఉక్కుపాదం మోపారు. లేటెస్ట్ గా ఇళయరాజా పంపిన లీగల్ నోటీసుల విషయంపై చిత్ర నిర్మాణ సంస్థల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ వివాదం, చిత్ర ప్రదర్శనపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Tags:    

Similar News