కథ మీద వున్న నమ్మకంతో రెమ్యూనరేషన్ లేకుండా వర్క్ చేశాను: యాక్టర్ బ్రహ్మాజీ
వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా 'బాపు'. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫెబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ కొన్ని విషయాలను పంచుకున్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ.."రెండు ఏళ్ళ క్రితం డైరెక్టర్ దయా నాకు కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది.రెగ్యులర్ క్యారక్టర్ లాగా కాకుండా డిఫరెంట్ గా అనిపించింది.కానీ సినిమా తీయడానికి బడ్జెట్ లేదు.కాబట్టి నేను కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా వర్క్ చేశాను.సినిమా హిట్ అయ్యాక వచ్చిన ప్రాఫిట్ లోనే తీసుకుంటాను అని చెప్పాను.ఈ కథలో చెప్పిన పాయింట్ నాకు చాలా కొత్తగా అనిపించింది.అలానే కమల్ హాసన్ గారి లాంటి పక్కన చేసిన గొప్ప నటి ఆమని, అలాంటిది ఆవిడతో కలిసి నటించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది.అదే విధంగా సుధాకర్ రెడ్డి గారు కూడా చాలా బాగా చేసారు. ఈ ఏజ్ లో కూడా చాలా ఓపికగా నటించారు. అయనను చూసినప్పిడు అనిపిస్తుంది అంత ఏజ్ వచ్చే టైం కి కూడా నేను ఆలా నటించాలి అని.
ముఖ్యంగా చాలా రోజుల తరువాత ఈ సినిమా కోసం క్యారీ వ్యాన్ లేకుండా వర్క్ చేసాం.పాత రోజులు గుర్తుకువచ్చాయి.ప్రత్యేకించి కష్టంలో వున్న రైతు పాత్ర చేయడానికి న్యాచురల్ గా ఉండేలా మేకప్ కూడా వాడలేదు.ప్రీమియర్ షోస్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది.చాలా రోజుల తరువాత ఒక చిన్న సినిమాకి ఓటిటి మార్కెట్ కూడా చాలా సులభతరంగా అయిపోయింది.ఒక పాత్ర చేయాలి అంటే నాకు నచ్చితే కచ్చితంగా చేస్తాను.అలానే ఈ సినిమాకి బజ్ క్రియేట్ అవ్వడానికి ఇండస్ట్రీ లో చాలా మంది హెల్ప్ చేసారు.ముఖ్యంగా రానా నేను పిలవగానే వచ్చి ట్రైలర్ లాంచ్ చేసారు.
కంటెంట్ బాగుంటే ప్రేక్షకుల ఆదరిస్తారు అని నేను ఎప్పుడు నమ్ముతాను.ఒక విధంగా చెప్పాలి అంటే ఇలాంటి ఒక పాత్ర చేసినందుకు నాకు చాలా గర్వాంగా వుంది.నా నటనకు కూడా ప్రశంసలు వస్తున్నాయి.నాకు ఎమోషనల్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం." అని అన్నారు