పవన్ తో నటించడం నా అదృష్టం - నిధి అగర్వాల్

'హరిహర వీరమల్లు' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించింది. బాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నిధి.. టాలీవుడ్ లో ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తో పెద్ద విజయాన్ని అందుకోవాలని చూస్తుంది.;

By :  S D R
Update: 2025-07-21 06:04 GMT

'హరిహర వీరమల్లు' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించింది. బాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నిధి.. టాలీవుడ్ లో ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తో పెద్ద విజయాన్ని అందుకోవాలని చూస్తుంది. ఈ సినిమాకోసం నాలుగేళ్లకు పైగా తన సమయాన్ని కేటాయించింది నిధి. అంతేకాకుండా.. ఈ చిత్రానికి అందరికంటే మిన్నగా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంది.

ప్రస్తుతం జరుగుతున్న 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో నిధి మాట్లాడుతూ.. పవన్‌ సార్ తో నటించడం నా అదృష్టం అని తెలిపింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని నిధి ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Tags:    

Similar News