'తండేల్'లో పాకిస్తాన్ ఎపిసోడ్ ఉండేది ఎంతసేపు?

యువ సామ్రాట్ నాగచైతన్య లేటెస్ట్ మూవీ 'తండేల్'. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 'కార్తికేయ 2' సినిమాని మైథలాజికల్ టచ్ తో తెరకెక్కించిన చందూ మొండేటి 'తండేల్' కోసం పేట్రియాటిక్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు.;

By :  S D R
Update: 2025-01-31 01:19 GMT

యువ సామ్రాట్ నాగచైతన్య లేటెస్ట్ మూవీ 'తండేల్'. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 'కార్తికేయ 2' సినిమాని మైథలాజికల్ టచ్ తో తెరకెక్కించిన చందూ మొండేటి 'తండేల్' కోసం పేట్రియాటిక్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు. శ్రీకాకుళంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాని రూపొందించాడు.


శ్రీకాకుళంకు చెందిన కొంతమంది జాలర్లు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ నేవీకి చిక్కడం.. ఆ తర్వాత వారు అక్కడ నుంచి బయటపడ్డారా? లేదా అనే ఎలిమెంట్స్ తో 'తండేల్' సినిమాని తీర్చిదిద్దాడు చందూ మొండేటి. అయితే 'తండేల్' ట్రైలర్ చూసిన తర్వాత పాకిస్తాన్ ఎపిసోడ్స్ పై మిశ్రమ స్పందన వచ్చింది.


ఒక జాలరి పాకిస్తాన్ ఆర్మీని ఎదురించి నిలబడటం సాధ్యమా? ఆ ఎపిసోడ్స్ సినిమాలో ఎలా వర్కవుట్ అవుతాయో? అనే సందేహాలు మొదలయ్యాయి. లేటెస్ట్ గా వాటిన్నంటిపైనా క్లారిటీ వచ్చేసింది. 'తండేల్' చిత్రంలో పాకిస్తాన్ కు సంబంధించి ఎపిసోడ్స్ కేవలం 20 నిమిషాల పాటే ఉంటాయనేది చిత్రబృందం చెబుతున్న మాట.


సినిమా ఆద్యంతం నాగచైతన్య, సాయిపల్లవి లవ్‌స్టోరీ ప్రధానంగా ఉంటుందట. క్లైమాక్స్ ఎపిసోడ్ లో మాత్రమే ఒక 20 నిమిషాల పాటు పాకిస్తాన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంఛ్ ఈరోజు జరగబోతుంది. ఈ వేడుకకు అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. మొత్తంగా.. నాగచైతన్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న 'తండేల్' ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


Tags:    

Similar News