హోంబలే 'మహా అవతార్' యూనివర్శ్!
'కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలతో అగ్ర నిర్మాణ సంస్థగా అవతరించింది హోంబలే ఫిలిమ్స్. ఇప్పుడు హోంబలే.. శ్రీ మహావిష్ణువు దశావతారాల ఆధారంగా రూపొందనున్న భారీ యానిమేటెడ్ సీరీస్ కు శ్రీకారం చుట్టింది.;
'కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలతో అగ్ర నిర్మాణ సంస్థగా అవతరించింది హోంబలే ఫిలిమ్స్. ఇప్పుడు హోంబలే.. శ్రీ మహావిష్ణువు దశావతారాల ఆధారంగా రూపొందనున్న భారీ యానిమేటెడ్ సీరీస్ కు శ్రీకారం చుట్టింది. ‘మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరుతో 12 ఏళ్లలో ఏకంగా 7 చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.
ఈ మైథలాజికల్ యానిమేటెడ్ సినిమాలు 3D ఫార్మాట్‌లో రూపొందనున్నాయి. క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ ఫ్రాంచైజీని రూపొందిస్తున్నారు. తొలి సినిమా ‘మహా అవతార్: నరసింహ’ జూలై 25, 2025న ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
హోంబలే ఫిలిమ్స్ ప్రకటించిన విడుదల ప్రణాళిక:
మహా అవతార్: నరసింహ (2025)
మహా అవతార్: పరశురామ్ (2027)
మహా అవతార్: రఘునందన్ (2029)
మహా అవతార్: ద్వారకాధీశ్ (2031)
మహా అవతార్: గోకులానంద్ (2033)
మహా అవతార్: కల్కి – పార్ట్ 1 (2035)
మహా అవతార్: కల్కి – పార్ట్ 2 (2037)
ఈ యూనివర్స్ సినిమాలతో పాటు కామిక్స్, వీడియో గేమ్స్, డిజిటల్ స్టోరీటెల్లింగ్, కలెక్టబుల్స్ రూపంలో కూడా ‘మహా అవతార్’ ప్రపంచాన్ని విస్తరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారతీయ పౌరాణికతను ఆధునిక టెక్నాలజీతో ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే వారి లక్ష్యం.
ఇక ఈ సిరీస్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భాగమవుతాడా? అన్నదానిపై చర్చ మొదలైంది. ఇప్పటికే 'సలార్, సలార్ 2'లతో హోంబలే ఫిలిమ్స్‌తో ప్రభాస్‌కు బంధం ఉంది. మరో మూడు ప్రాజెక్టులకు ఒప్పందం కూడా ఉన్నట్టు సమాచారం. అందువల్ల మహా అవతార్ యూనివర్స్‌లో ప్రభాస్ కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశముంది.