మురుగదాస్ ను తిరిగి ఫామ్ లోకి తెచ్చే సినిమా ఏది?

Update: 2025-03-03 04:23 GMT

శంకర్ తర్వాత కోలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సామాజిక సందేశాన్ని చక్కగా మేళవించే దర్శకుల్లో ఏ.ఆర్. మురుగదాస్ ప్రముఖుడు. ‘గజిని’ సినిమా అతని కెరీర్‌లో మలుపు తిప్పగా, ‘స్టాలిన్’, ‘7ఆమ్ అరివు’, ‘తుపాకి’, ‘కత్తి’ వంటి విజయవంతమైన చిత్రాలు అందించాడు. అయితే, ‘స్పైడర్’, ‘దర్బార్’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఈ పరాజయాల అనంతరం మురుగదాస్ రెండు ముఖ్యమైన ప్రాజెక్టులను చేజిక్కించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’, శివకార్తికేయన్‌తో ‘మదరాసి’. అయితే.. ‘సికందర్’ టీజర్ నెగటివ్ ఫీడ్‌బ్యాక్‌ను ఎదుర్కొంటోంది. మురుగదాస్ మార్క్ కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సినిమాపై అనుమానాలను పెంచుతోంది.

ఇదే సమయంలో, శివకార్తికేయన్ నటించిన ‘మదరాసి’పై భారీ అంచనాలున్నాయి. శివకార్తికేయన్ గత చిత్రం ‘అమరన్’ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మురుగదాస్ గత ఫెయిల్యూర్స్‌ వల్ల కొంత మందికి సందేహాలు ఉన్నా.. ‘మదరాసి’ టీజర్ వాటిని తొలగించింది. ఇందులోని విజువల్స్, కథన శైలి ‘సికందర్’ కంటే మెరుగ్గా అనిపిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ స్టైల్ మురుగదాస్‌కు తగ్గట్లు ఉందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. కానీ శివకార్తికేయన్‌ డెడికేషన్ వల్ల ‘మదరాసి’ బలమైన చిత్రంగా మారే అవకాశం ఉంది. ‘సికందర్’పై వస్తున్న క్రిటిసిజం నేపథ్యంలో, మురుగదాస్ తన డైరెక్షన్ పవర్‌ను మరోసారి రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News