ముందు కార్ రేసింగ్.. తర్వాతే నెక్స్ట్ మూవీ

రేసింగ్ సీజన్ పూర్తయిన తర్వాత, ఈ ఏడాది చివరిలో, అంటే 2025 డిసెంబర్ నాటికి మాత్రమే తన తదుపరి చిత్రం పనులను ప్రారంభిస్తానని అజిత్ గతంలోనే స్పష్టం చేశాడు.;

By :  K R K
Update: 2025-07-21 01:11 GMT

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజా చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విశేషమైన విజయాన్ని సాధించి.. అజిత్ అభిమానులకు మరోసారి తమ అభిమాన నటుడి సత్తాను చాటింది. అయితే, అజిత్ ప్రస్తుతం తన నటనా వృత్తికి కాస్త విరామం ఇచ్చి.. తన మరో అభిరుచి అయిన కార్ రేసింగ్ కెరీర్‌పై తీవ్ర దృష్టి సారిస్తున్నాడు. ఈ కారణంగా, ఆయన ప్రస్తుతం ఏ కొత్త సినిమా ప్రాజెక్టుల్లోనూ కమిట్ కాలేదు. రేసింగ్ సీజన్ పూర్తయిన తర్వాత, ఈ ఏడాది చివరిలో, అంటే 2025 డిసెంబర్ నాటికి మాత్రమే తన తదుపరి చిత్రం పనులను ప్రారంభిస్తానని అజిత్ గతంలోనే స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో.. అజిత్ తదుపరి చిత్రం, ఇండస్ట్రీలో “ఏకే64”గా పిలువబడుతున్న ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఇది అజిత్, ఆదిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో రెండో చిత్రం కావడం విశేషం. ఇంతకు ముందు వీరిద్దరూ “గుడ్ బ్యాడ్ అగ్లీ” చిత్రం కోసం కలిసి పనిచేసి, ఆ చిత్రం అభిమానుల నుండి మంచి ఆదరణ పొందడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఆదిక్ రవిచంద్రన్ తాజాగా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, “ఏకే64” చిత్రం అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఈ ప్రకటనలో చిత్రంలో నటించే ఇతర ప్రముఖ నటీనటులు, సాంకేతిక సిబ్బంది, ఇతర ముఖ్యమైన వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ జానర్‌కు సంబంధించినది కాదని కూడా అదిక్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్య అభిమానుల్లో కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఎందుకంటే అజిత్ సాధారణంగా యాక్షన్ లేదా థ్రిల్లర్ జానర్ చిత్రాల్లో నటించడం సర్వసాధారణం. మరి ఈ సారి ఇలాంటి జోనర్ ను అజిత్ ఎంపిక చేసుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News