విడుదల ఖరారు చేసుకున్న విక్రమ్ చిత్రం!

Update: 2025-03-06 16:10 GMT

విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీర ధీర శూర పార్ట్ 2’. అసలు ఒక సినిమాకి ఫస్ట్ పార్ట్ రిలీజైన తర్వాత సెకండ్ పార్ట్ తీసుకొస్తారు. కానీ ఈ చిత్రాన్ని సెకండ్ పార్ట్ తో మొదలు పెట్టడం విశేషం. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ కీలక పాత్రలు పోషించారు.




 



హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందిస్తుందని నమ్ముతుంది టీమ్. మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది పొంగల్ రేసులో విడుదల చేద్దామనుకున్నారు. అనివార్య కారణాలతో వాయిదా పడింది. లేటెస్ట్ గా ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది. మార్చి 27న వరల్డ్ వైడ్ గా విడుదలకు ముస్తాబవుతుంది. ఎన్.వి.ఆర్. సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుంది.

Tags:    

Similar News