విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’ చిత్రానికి సరికొత్త రిలీజ్ డేట్!

Update: 2025-02-28 04:51 GMT

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలయికలో రూపొందిన స్పై థ్రిల్లర్ 'ధ్రువనక్షత్రం'. అనేక ఆర్థిక సమస్యల కారణంగా పలు మార్లు వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మే నెలలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే.. అధికారిక విడుదల తేదీపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

‘ధ్రువనక్షత్రం’ చిత్రం 2017లో షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఆర్థిక పరమైన, చట్టపరమైన సమస్యల కారణంగా షూటింగ్ అనేక సంవత్సరాలు నిలిచిపోయింది. చివరికి 2023లో షూటింగ్ పూర్తయింది. కానీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. అదే జరిగితే, సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న 'రెట్రో' చిత్రంతో దీని బాక్సాఫీస్ పోటీ నెలకొననుంది.

ఈ చిత్రాన్ని మొదట్లో సూర్యతో ప్లాన్ చేశారు. అయితే, సూర్య, గౌతమ్ మీనన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏర్పడటంతో సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ చియాన్ విక్రమ్‌ను ఒప్పించి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా అనేక ఆలస్యాల కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని గౌతమ్ మీనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, రీతూ వర్మ జోడీగా నటించగా.. సిమ్రన్, పార్థిబన్, రాధిక శరత్‌కుమార్, వినాయకన్, దివ్యదర్శిని, వంశీ కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించాడు.

Tags:    

Similar News