విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ రిలీజ్ డేట్ ఇదే !

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో ప్రముఖ ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.;

By :  K R K
Update: 2025-05-15 01:41 GMT

తమిళ సంగీత దర్శకుడు, హీరో అయిన విజయ్ ఆంటోనీ తరచూ విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఇప్పుడు అతడి తాజా చిత్రం “మార్గన్” ద్వారా మళ్ళీ ప్రేక్షకులను థ్రిల్ లో ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది ఒక ఆసక్తికరమైన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాను మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో ప్రముఖ ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. “మార్గన్” జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే చిత్రంతో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధిషాన్ పవర్‌ఫుల్ విలన్‌గా సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. అలాగే సముద్రఖని, మహానటి శంకర్, పృథికా, బ్రిగిడా, వినోధ్ సాగర్, దీప్షికా, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగరం నటరాజన్ వంటి పలువురు ప్రముఖులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. “మార్గన్” చిత్రం భావోద్వేగాల్ని, మిస్టరీని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో సమన్వయం చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించబోతోంది.

Tags:    

Similar News