టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటి త్రిషా కృష్ణన్. ఇప్పుడు ఆమె చేతిలో వరుస సినిమాలు ఉండటమే ఇందుకు కారణం. ఈ టాలెంటెడ్ నటి ఇప్పుడు ఇండస్ట్రీలోని అతిపెద్ద స్టార్స్‌తో కలిసి పని చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా.. ఆమె లోకనాయకుడు కమల్ హాసన్‌తో కలిసి ఒక ప్రత్యేకమైన క్షణాన్ని షేర్ చేసుకుంది. త్రిషా ప్రస్తుతం కమల్ హాసన్, మణిరత్నం కాంబో మూవీ ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో కమల్ హాసన్‌తో కలిసి ముచ్చటించిన ఈ నటి.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
మావ్ కలర్ ప్యాంట్ సూట్‌లో త్రిషా చాలా అందంగా కనిపించగా.. కమల్ హాసన్ ఫార్మల్ సూట్‌లో తన స్టైల్‌ను ప్రదర్శించారు. ఈ ఫోటోపై త్రిషా "మార్నింగ్స్ లైక్ దీజ్" అని క్యాప్షన్ పెట్టింది. ఇదిలా ఉండగా, తన పెంపుడు కుక్క జోరో మరణించిన తరువాత, త్రిషా కొత్తగా మరో కుక్కను దత్తత తీసుకుంది. తన జీవితంలో కొత్తగా వచ్చిన ఈ నేస్తం, తనను ముందుకు సాగేలా ఎలా ప్రేరేపించిందో తెలుపుతూ, ఈ కుక్క ఫోటోను అభిమానులతో పంచుకుంది.
ఇటీవల అజిత్ ‘విడాముయర్చి’ చిత్రంలో త్రిషా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. తర్వాత ఆమె మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, అజిత్ తో మరోసారి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇవి కాకుండా సూర్య 45వ చిత్రంలోనూ త్రిషా కథానాయికగా కనిపించనుంది. అంతేకాదు, మళయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌తో కలిసి మరో చిత్రం కూడా చేస్తోంది. ఈ విధంగా, వరుస ప్రాజెక్టులతో త్రిషా దక్షిణాది సినీ పరిశ్రమలో బిజీగా మారింది.