కోలీవుడ్ బాట పట్టిన టాలీవుడ్ బ్యూటీస్ వీళ్ళే !

Update: 2025-03-02 11:19 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న హీరోయిన్లు ఇతర భాషల్లో అవకాశాలను అన్వేషించడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఈ కోవలో ఇప్పుడు కృతి శెట్టి, పూజా హెగ్డే లు చేరిపోయారు.




 కృతి శెట్టి

‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి, ఆ తర్వాత వరుస ప్లాపులతో కష్టాల్లో పడింది. ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కస్టడీ’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు ప్రధాన పాత్రలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కృతి తమిళ ఇండస్ట్రీపై దృష్టిపెట్టింది. ఇప్పటికే జయం రవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా 'జీనీ' లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు, ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్ ఐ కే ’ ప్రాజెక్ట్ లో కూడా ఆమె నటించే అవకాశముంది.



పూజా హెగ్డే

ఒకప్పుడు టాలీవుడ్ లో ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్ తో దూసుకుపోయిన పూజా హెగ్డే ఇటీవల వరుస పరాజయాలతో వెనుకబడ్డారు. ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా అపజయం పాలయ్యాయి. దీంతో ఆమె తమిళ ఇండస్ట్రీలో కొత్త అవకాశాలను వెతుక్కుంటోంది. ఇప్పటికే కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రెట్రో’, రజనీకాంత్ ‘కూలీ’, విజయ్ ‘జననాయకన్’ వంటి భారీ చిత్రాల్లో ఆమె ఛాన్స్ దక్కించుకుంది.

ఇతర భాషల్లో అవకాశాలు వెతకడం కొత్త విషయం కాదు. కానీ వరుస ఫ్లాపులు ఈ ఇద్దరు హీరోయిన్లను తమిళ ఇండస్ట్రీ వైపు మళ్లించాయి. కోలీవుడ్ ప్రస్తుతం కొత్త కథలు, మహిళా ప్రాధాన్యత కలిగిన పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ తరుణంలో కృతి, పూజా తమ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒక వేళ వీరి తమిళ సినిమాలు సూపర్ హిట్ అయితే.. టాలీవుడ్‌లో మళ్లీ రీ ఎంట్రీకి అవకాశం లభించే అవకాశం ఉంది. 2025లో ఈ ఇద్దరు నటీమణులు తమ కొత్త తమిళ ప్రాజెక్ట్స్‌తో ఎలా మెరవబోతున్నారో చూడాలి.

Tags:    

Similar News