సుహాస్ సైలెంట్ కోలీవుడ్ ఎంట్రీ !
అద్భుతమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ఇప్పుడు ఊహించని విధంగా తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి హీరోగా కాదు, సూరి హీరోగా నటిస్తున్న ‘మందాడి’ అనే సినిమాలో కీలక సహాయ పాత్రలో కనిపించబోతున్నాడు.;
గతంలో ఎప్పుడైనా ఒక తెలుగు నటుడు ఎలాంటి హడావిడి లేకుండా.. సైలెంట్ గా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడా? యంగ్ హీరో సుహాస్ ఇప్పుడు అలాంటి సాహసమే చేశాడు. తెలుగు సినిమాల్లో తన సహజమైన నటన.. అద్భుతమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ఇప్పుడు ఊహించని విధంగా తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి హీరోగా కాదు, సూరి హీరోగా నటిస్తున్న ‘మందాడి’ అనే సినిమాలో కీలక సహాయ పాత్రలో కనిపించబోతున్నాడు.
యూట్యూబ్ షార్ట్స్ నుంచి జాతీయ స్థాయి గుర్తింపు వరకూ సుహాస్ ప్రయాణం సాధారణమైంది కాదు. పాండమిక్ సమయంలో వచ్చిన ‘కలర్ ఫోటో’ తో అతడు ఒక్కసారిగా హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. అంతేకాదు.. తన ‘బాయ్ నెక్స్ట్ డోర్’ ఇమేజ్‌ను పక్కనపెట్టి ‘హిట్ 2’ లో విలన్‌గా మారి తన నటనలోని మరో కోణాన్ని చూపించాడు.
ఇప్పుడు సుహాస్ సరికొత్త పాత్రతో కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా ప్రకటన ఎలాంటి హైప్ లేకుండా వచ్చినా.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. విజయ్ సేతుపతితో ఒక ఓపెన్ ఇంటర్వ్యూలో సుహాస్ చూపించిన స్పాంటినిటీ తమిళ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకుంది. ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా అతడు సైలెంట్ గా తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఈ అడుగు సుహాస్ కెరీర్‌లో ఒక గేమ్ ఛేంజర్ అవుతుందో లేక కేవలం అతడి విభిన్నమైన ప్రయాణంలో మరో అధ్యాయంగా మిగిలిపోతుందో తెలియదు. కానీ ఒక విషయం స్పష్టం. సుహాస్ సాంప్రదాయ నియమాలను అనుసరించే వాడు కాదు. అతడు తనదైన మార్గంలో.. ఊహించని పాత్రలతో సరికొత్తగా తనను తను మలుచుకుంటున్నాడు.