మలయాళ పాటలపోటీల్లో తమిళ సినీ సింగర్

క్రేజీ తమిళ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద ఆసియానెట్ మ్యూజిక్ కాంపిటీషన్ షో స్టార్ సింగర్ సీజన్ 10లో గెస్ట్‌గా డెబ్యూ చేయనుంది. ఇది కేరళ ఆధారిత మ్యూజిక్ కాంపిటీషన్‌లో ఆమె మొదటి ఎంట్రీ.;

By :  K R K
Update: 2025-07-05 03:56 GMT

క్రేజీ తమిళ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద ఆసియానెట్ మ్యూజిక్ కాంపిటీషన్ షో స్టార్ సింగర్ సీజన్ 10లో గెస్ట్‌గా డెబ్యూ చేయనుంది. ఇది కేరళ ఆధారిత మ్యూజిక్ కాంపిటీషన్‌లో ఆమె మొదటి ఎంట్రీ. ఈ షో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. జడ్జెస్‌గా కెఎస్ చిత్ర, విధు ప్రతాప్, సితార తిరిగి వస్తున్నారు. "నేను దీని గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా," అని చిన్మయి తన పాల్గొనడం గురించి చెప్పింది. "చిత్ర గారు, సితార, విధు చెప్పినట్లు ఈ షోలో కంటెస్టెంట్స్ అద్భుతంగా పాడతారని విన్నాను. వాళ్ల పెర్ఫార్మెన్స్ చూడటానికి ఆత్రుతగా ఉన్నాను..." అని చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

మలయాళ సినిమాల్లో చిన్మయి గుర్తించదగిన పాటలు.. 'ఊంజలిలాడి వన్న' (ఆక్షన్ హీరో బిజు), 'ఓమనే' (ఆడుజీవితం), 'ఆరోమలే' (C/O సైరా బాను), 'మాయాదే ఓర్మయిల్' (హీరో). ఇటీవల, కమల్ హాసన్, మణిరత్నం చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్‌లో చిన్మయి పాడిన 'ముత్త మళై' పాటకు భారీ ప్రశంసలు దక్కాయి. ఈ పాట ఆమె గొప్ప వాయిస్ టాలెంట్‌ను గుర్తుచేసింది, అయితే దీన్ని ధీ ఒరిజినల్ వెర్షన్‌తో అనవసరంగా పోల్చారు. ఈ పాట యూట్యూబ్‌లో టాప్ చార్ట్స్‌లో నిలిచి 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

తమిళ సినిమాల్లో చిన్మయి పాడకుండా నిషేధాన్ని ఎదుర్కొంటోంది. లిరిసిస్ట్ వైరముత్తుపై మీటూ ఆరోపణలు, డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంఘీభావం తెలిపినందుకు, సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ ఆమె మెంబర్‌షిప్‌ను రద్దు చేసింది, దీంతో తమిళ సినిమాల్లో ఆమె పనిచేయలేకపోతోంది. అయినప్పటికీ, ఆమె ఈ నిషేధాన్ని దాటుకుని లోకేష్ కనగరాజ్, విజయ్ చిత్రం ‘లియో’ వంటి కొన్ని ప్రాజెక్ట్‌లలో పాడింది. ఇతర భాషల్లో కూడా ఆమె పాడుతోంది. ఇటీవల 'ముత్త మళై' హిందీ, తెలుగు వెర్షన్స్‌లో ఆమె కంట్రిబ్యూట్ చేసింది.

Tags:    

Similar News