రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన ‘లవ్ టుడే’ హీరో !
తాజా సమాచారం ప్రకారం, తన నటనకు భారీ డిమాండ్ ఉండడంతో ఒక్కో సినిమాకు 18 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోరుతున్నాడట ప్రదీప్.;
కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన వెరైటీ లవ్ స్టోరీ ‘లవ్ టుడే’. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న చిత్రం.. యువత ప్రేమలో ఎదుర్కొనే విభిన్న పరిస్థితులను చూపిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అరవై కోట్లకుపైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాపేరు మారు మోగడంతో .. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని అదే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.
‘లవ్ టుడే’ కథాంశం యువతను మంత్రముగ్దులను చేసింది. ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి తమ ఫోన్లు మార్చుకుంటే ఏం జరుగుతుందనే ఆకర్షణీయమైన పాయింట్‌తో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఇవానా యువతలో డ్రీమ్ గర్ల్‌గా గుర్తింపు పొందగా.. హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేశాడు. కేవలం నటుడే కాదు, దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘డ్రాగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు.
ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో వరుస సినిమాలు లైనప్ చేసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం, తన నటనకు భారీ డిమాండ్ ఉండడంతో ఒక్కో సినిమాకు 18 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోరుతున్నాడట. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రదీప్ క్రేజ్‌కి తగ్గట్టే ఇది సహజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.