డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయా?

నిర్మాతలు, స్టార్ హీరోలు ఇకపై శంకర్‌ కు తమ విలువైన డేట్స్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితి చూస్తే, శంకర్ కెరీర్ ఒక కీలక మలుపు దశలో నిలిచింది.;

By :  K R K
Update: 2025-04-28 00:41 GMT

ఒకప్పుడు ఇండియన్ స్ర్కీన్ పై అత్యంత గౌరవప్రదమైన దర్శకుల్లో ఒకరైన మావెరిక్ డైరెక్టర్ శంకర్.. ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. క్లాసికల్ బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కెరీర్.. ఇటీవలి కాలంలో ఘోర పరాజయాలతో కొనసాగుతోంది. శంకర్ తాజాగా రామ్ చరణ్‌తో తెరకెక్కించిన ‘గేమ్ చేంజర్’  చిత్రం ఇటీవల కాలంలోనే అతిపెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

ముఖ్యంగా.. "ఆర్ఆర్ఆర్" తర్వాత చరణ్ కెరీర్‌లో దాదాపు రెండున్నర సంవత్సరాల సమయాన్ని శంకర్ వృథా చేశాడని.. ఈ మూవీతో ఆయన ప్రతిష్ఠ, వారసత్వం తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ శ్రమను, సమయాన్ని శంకర్ తన నిర్లక్ష్య ధోరణితో పూర్తిగా వృథా చేశాడనే అభిప్రాయం విస్తృతంగా వ్యాపించింది.

ఇది చాలనట్లుగా.. శంకర్ "ఇండియన్ 2" పనుల్లో కూడా జోక్యం చేసుకున్నాడు. చరణ్ సినిమా పనిని మద్యలో నిలిపేసి.. ‘ఇండియన్ 2’ పై దృష్టి పెట్టడం ఆయనలోని అనాధికార వ్యవహార శైలిని బహిర్గతం చేసిందని విమర్శలొచ్చాయి. దీనివల్ల ఆయనపై ఉన్న నమ్మకం మరింత తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో, ప్రస్తుతం శంకర్ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేనట్టు సమాచారం.

"గేమ్ చేంజర్" సినిమా విషయంలో జరిగిన బిజినెస్ మేనేజ్‌మెంట్ చూస్తే, నిర్మాతలు, స్టార్ హీరోలు ఇకపై శంకర్‌ కు తమ విలువైన డేట్స్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితి చూస్తే, శంకర్ కెరీర్ ఒక కీలక మలుపు దశలో నిలిచింది. తిరిగి తానే తాను ఎలా తిరిగి నిలబెట్టుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News