సూపర్ స్టార్ తో సూపర్ డైరెక్టర్ సినిమా?

Update: 2025-02-22 07:10 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండగానే, ‘జైలర్ 2’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా, రజనీకాంత్‌ మరో ప్రాజెక్ట్‌ కోసం కథా చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఓ కథ వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి. ‘వడ చెన్నై’, ‘అసురన్‌’, ‘విడుదలై’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన వెట్రిమారన్‌.. ఈ కథతో రజనీకాంత్‌ను మరో పవర్‌ఫుల్ రోల్‌లో చూపించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

అయితే.. రజనీకాంత్‌ ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత వెట్రిమారన్‌ మరోసారి రజనీతో చర్చలు జరపనున్నారని సమాచారం. ప్రస్తుతం వెట్రిమారన్‌ సూర్యతో ‘వాడివాసల్’ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీ, వెట్రిమారన్ కాంబినేషన్ ఖరారైతే.. ఇది తమిళ సినీ ప్రేక్షకులకు నిజమైన ట్రీట్‌గా మారనుంది!


 


Tags:    

Similar News