సింబు బర్త్ డే సర్ ప్రైజ్ అదిరింది !

చిత్రబృందం తాజాగా సింబు పుట్టినరోజును పురస్కరించుకుని కొత్త ప్రోమోను విడుదల చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.;

By :  K R K
Update: 2025-02-04 01:21 GMT

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ చిత్రం ‘థగ్ లైఫ్’. చిత్రబృందం తాజాగా సింబు పుట్టినరోజును పురస్కరించుకుని కొత్త ప్రోమోను విడుదల చేసింది. ఈ వీడియోలో సింబు లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఫిల్మ్‌ కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. 1987లో విడుదలైన ఐకానిక్ చిత్రం ‘నాయకన్’ తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఇదే.

‘థగ్ లైఫ్’ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సింబు, త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, సాన్యా మల్హోత్రా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2025 జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి దుల్కర్ సల్మాన్, రవి మోహన్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించాల్సి ఉన్నా.. షెడ్యూల్ సమస్యల కారణంగా తప్పుకున్నారు. అనంతరం దుల్కర్ పాత్రలోకి సింబు అడుగుపెట్టాడు.

సింబు చివరగా 2023లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘పత్తు తల’లో ప్రధాన పాత్రలో నటించాడు. ఇటీవల తన తదుపరి సినిమాను ‘పార్కింగ్’ డైరెక్టర్ రామ్‌కుమార్ బాలకృష్ణన్‌తో కలసి చేస్తున్నట్లు ప్రకటించాడు. STR 49 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా “ది మోస్ట్ వాంటెడ్ స్టూడెంట్ ” అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతోంది. మరి థగ్ లైఫ్ సింబు కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Tags:    

Similar News