ఇండియన్ క్రికెటర్ గా సింబు?

Update: 2025-05-03 05:46 GMT

తమిళ స్టార్ హీరో సింబు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. త్వరలో కమల్ హాసన్, మణిరత్నం కాంబో లోని అత్యంత ప్రతిష్టాత్మక గ్యాంగ్‌స్టర్ డ్రామా "థగ్ లైఫ్" లో కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే కోలీవుడ్ మీడియాలో కొత్త గాసిప్ హల్‌చల్ చేస్తోంది. సింబు, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించనున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ఓ చాట్ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ, సింబు నటించిన "పత్తు తల" సినిమాకు ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన "నీ సింగం ధాన్" పాట తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ చాట్ షో లింక్‌ను ఆర్ సి బి

అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయగా, సింబు దానిని రీట్వీట్ చేస్తూ "నీ సింగం ధాన్" అంటూ రెడ్ హార్ట్, ఫైర్, లయన్ ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. అప్పటి నుంచి విరాట్ – సింబు ఫ్యాన్స్ ఇద్దరూ ఈ ఇద్దరి మధ్య ఓ ఆసక్తికరమైన కాలాబొరేషన్ జరుగుతుందేమోనని ఊహించుకుంటున్నారు.

ప్రస్తుతం సింబు చేతిలో అరుదైన ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ప్రముఖ "డ్రాగన్" దర్శకుడు అశ్వత్ మరిముత్తుతో ఓ సినిమా ప్రాజెక్ట్ ఒకటి ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటిస్తే, అది సింబు కెరీర్‌లో పెద్ద మైలురాయిగా మారి, ఆయనకు పాన్ ఇండియా స్టార్ హోదా తీసుకురావడం ఖాయం.

Tags:    

Similar News