డిస్కో శాంతి రీఎంట్రీ

80, 90లలో నటిగా, డ్యాన్సర్ గా ప్రేక్షకులను అలరించిన డిస్కో శాంతి దాదాపు ముఫ్ఫై ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి వస్తుంది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్‌'బుల్లెట్'లో జోస్యం చెప్పే ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది డిస్కో శాంతి.;

By :  S D R
Update: 2025-08-09 02:37 GMT

80, 90లలో నటిగా, డ్యాన్సర్ గా ప్రేక్షకులను అలరించిన డిస్కో శాంతి దాదాపు ముఫ్ఫై ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి వస్తుంది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్‌'బుల్లెట్'లో జోస్యం చెప్పే ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది డిస్కో శాంతి. ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్‌పై కదిరేశన్ నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది.

శాంతి అసలు పేరు శాంత కుమారి. తమిళ నటుడు సీఎల్ ఆనందన్ కుమార్తె. పలు భాషల్లో వందల సినిమాల్లో నటించిన డిస్కో శాంతి 1996లో నటుడు శ్రీహరితో వివాహం తర్వాత సినిమాలకు విరామం ఇచ్చింది. కుమార్తె అక్షర స్మారకార్థం అక్షర ఫౌండేషన్‌ను స్థాపించి, పలు గ్రామాలకు సహాయం అందించారు. 2013లో శ్రీహరి మరణించగా, ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.


Full View


Tags:    

Similar News