రజనీసార్ అనేక గొప్పగుణాల మిశ్రమం : శ్రుతి హాసన్

చిన్నప్పటినుంచి పాపాను చూసి పెరిగిన నేను రజినీ సర్‌ను చూసి షాకయ్యాను. రజినీ సర్‌ను చూస్తుంటే ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యపడదు," అని శ్రుతి హాసన్ చెప్పింది.;

By :  K R K
Update: 2025-04-27 08:33 GMT

తాజాగా శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కూలీ" సినిమాలో రజనీకాంత్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన భావాలను బయటపెట్టింది. "రజిని సర్‌ను కలవడం, ఆయనతో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన పాపా (కమల్ హాసన్) కి పూర్తి భిన్నంగా ఉంటారు. చిన్నప్పటినుంచి పాపాను చూసి పెరిగిన నేను రజినీ సర్‌ను చూసి షాకయ్యాను. రజినీ సర్‌ను చూస్తుంటే ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యపడదు," అని ఆమె చెప్పింది.

అదే ఆయనలోని గొప్పతనం కూడా. ఆయన అనేక గొప్ప గుణాల మిశ్రమం. ఆయన చాలా తెలివిగా, నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. అయితే, ప్రతి విషయంలో కూడా ఆయనకు స్పష్టత ఉంటుంది," అని వివరించింది. ఇంటర్వ్యూలో శృతి హాసన్ మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రజినీకాంత్ సార్.. తనను, తన తండ్రి కమల్ హాసన్‌ని కలిపి పాత రోజుల్లో జరిగిన అనేక మధుర జ్ఞాపకాల గురించి చెప్పే వింత అనుభవాన్ని ఆమె గుర్తుచేసుకుంది.

ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలి’ చిత్రం 2025 ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున అక్కినేని, ఉపేంద్ర రావు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Tags:    

Similar News