బంపర్ ఆఫర్ కొట్టేసిన శివానీ రాజశేఖర్ !
ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జీడీయన్’ అనే చిత్రంలో నటించబోతోంది శివానీ. ఈ సినిమాకు క్రిష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.;
యాంగ్రీమేన్ రాజశేఖర్ తనయ.. శివానీ రాజశేఖర్‌కు మళ్లీ అవకాశాలు దక్కడం మొదలైంది. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రంలో తన అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు ఆమెకు ఒక బయోపిక్ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర దక్కింది. ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జీడీయన్’ అనే చిత్రంలో నటించబోతోంది శివానీ. ఈ సినిమాకు క్రిష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం ప్రముఖ ఆవిష్కర్త, ఇంజినీర్ జీడి నాయుడు జీవిత ఆధారంగా రూపొందుతోంది. శివానీ ఇందులో ఎలాంటి పాత్రలో నటించబోతోందో స్పష్టత రావలసి ఉంది. అయితే.. ప్రస్తుతం ఆమె తన కెరీర్ దశలో ఇదొక మంచి అవకాశంగా భావిస్తోంది. ఈ పాత్ర కోసం శివానీ సన్నాహాలు మొదలు పెట్టింది. జూన్‌లో చిత్ర షూటింగ్‌కు ఆమె జాయిన్ అవుతుంది. శివానీ రాజశేఖర్ ఇప్పటి వరకు తెలుగులో ‘పెళ్లి సందD, అద్భుతం, శేఖర్, కోట బొమ్మాళి పీఎస్, విద్యా వసుల అహం’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో శివానీకి మంచి బ్రేక్ దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.