మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది !
తాజాగా సంయుక్తా మీనన్ పేరు బాగా వినిపిస్తోంది. ఈమె ఇప్పటికే ‘భీమ్లా నాయక్, సార్’ వంటి హిట్లు సితార బ్యానర్ లోనే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా కుదిరితే ఆమెకు ఇది హ్యాట్రిక్ అవుతుంది.;
‘కంగువ’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం లభించకముందే, సూర్య ముందుగానే తన తదుపరి ప్రాజెక్టులపై స్పీడు పెంచాడు. మే 1న పూజా హెగ్డేతో కలిసి నటించిన ‘రెట్రో’ సినిమా థియేటర్లకు రానుండగా.. ఇప్పుడు ఆయన తదుపరి సినిమాపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య జతకట్టనున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్‌లు ఉండనున్నారని టాలీవుడ్ వర్గాల బజ్. తాజాగా సంయుక్తా మీనన్ పేరు బాగా వినిపిస్తోంది. ఈమె ఇప్పటికే ‘భీమ్లా నాయక్, సార్’ వంటి హిట్లు సితార బ్యానర్ లోనే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా కుదిరితే ఆమెకు ఇది హ్యాట్రిక్ అవుతుంది.
ఇంకొకవైపు భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా పక్కా కాకపోయినా... ప్రచారంలో ఉంది. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కోసం కాస్టింగ్ త్వరలో ఫిక్స్ అవుతుందని, షూటింగ్ ఎప్పుడైనా మొదలయ్యే అవకాశముందని సమాచారం. ఇటీవల జరిగిన పరాజయాల తర్వాత సూర్యకే కాదు, ఈ చిత్రబృందానికీ ఇది కీలకమైన సినిమా కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే, సూర్య అభిమానులు ఎదురు చూస్తున్న మరో ప్రాజెక్ట్ ‘వాడివాసల్’. దర్శక దిగ్గజం వెట్రిమారన్‌తో కలిసి సూర్య చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూలైలో మొదలవబోతోంది. ఇప్పటికే జి.వి. ప్రకాష్ ఓ సాంగ్ కంపోజ్ చేయడం పూర్తిచేసినట్లు సమాచారం. ఇలా చూస్తే.. ఈ ఒక్క సినిమానే కాకుండా.. వరుస ప్రాజెక్టులతో తన దూకుడు కొనసాగిస్తున్నాడు సూర్య. ఈ లైన్‌అప్ చూస్తుంటే రెట్టింపు అంచనాలు ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు.