శింబు సరసన హీరోయిన్ గా సాయిపల్లవి ?
సాయి పల్లవి సాధారణంగా రొమాంటిక్ పాత్రలకు దూరంగా ఉండే నటి. అయితే, శింబు, సాయి పల్లవి కాంబినేషన్ కొత్త రొమాంటిక్ జంటగా ప్రేక్షకులను అలరించనుంది.;
తమిళ హీరో శింబు వరుస సినిమాలతో తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'థగ్ లైఫ్' చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో శింబు.. కమల్ హాసన్ కొడుకుగా నటిస్తుండగా, త్రిష కథానాయికగా కనిపించనుంది. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా.. శింబు-మణిరత్నం కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా. ఇంతకు ముందు 'చిక్క చివంత వానం' లో నటించాడు శింబు.
ఇంకా.. 'కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లైఅడితాల్' దర్శకుడు దేసింగు పెరియసామి దర్శకత్వంలో కూడా శింబు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది అతడి 50వ సినిమా కావడంతో ప్రత్యేకంగా తన 'ఆత్మన్ సినీ ఆర్ట్స్' బ్యానర్‌పై నిర్మించనున్నాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శింబు ద్విపాత్రాభినయం చేయనున్నారు. సంగీతాన్ని యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు.
ఇక శింబు 51వ సినిమా కూడా ఖరారైంది. 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు 'గాడ్ ఆఫ్ లవ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇది ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనుంది. అశ్వత్ ప్రస్తుత చిత్రం 'డ్రాగన్' ఫిబ్రవరి 21న విడుదలైన తర్వాత శింబు ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెడతారని సమాచారం.
శింబు 49 సినిమాను రాంకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల 'పార్కింగ్' అనే చిత్రంతో హిట్ అందుకున్న అతడు... ఇప్పుడు శింబుతో కలిసి పని చేయనున్నాడు. ఈ సినిమాలో శింబు కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో శింబుకు జోడీగా సాయి పల్లవి నటించే అవకాశం ఉంది. ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయని టాక్.
సాయి పల్లవి సాధారణంగా రొమాంటిక్ పాత్రలకు దూరంగా ఉండే నటి. అయితే, శింబు, సాయి పల్లవి కాంబినేషన్ కొత్త రొమాంటిక్ జంటగా ప్రేక్షకులను అలరించనుంది. ఇక శింబు, సంతానం కాంబినేషన్ గతంలో హిట్ సినిమాలు అందించడంతో, ఈ సినిమా కూడా విజయవంతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాలతో శింబు కెరీర్ మరింత గరిష్ఠ స్థాయికి చేరుతుందని కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి!