100 కోట్ల క్లబ్ లోకి చేరిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’
ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అశ్వంత్ మారిముత్తు తెరకెక్కించిన ఈ సినిమా, ఫిబ్రవరి 21న విడుదలైనప్పటి నుంచి భారీ ప్రేక్షకాదరణను అందుకుంటోంది. ఎలాంటి పోటీ లేకుండా బాక్సాఫీస్‌ను కుదిపేస్తూ సూపర్‌హిట్‌గా నిలుస్తోంది.
ప్రస్తుతం సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ కారణంగా.. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను దాటింది. మొదటి వారంలో తమిళనాడులో మొత్తం రూ. 41 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో వీకెండ్‌లో భారీగా పెరిగిన కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఈ వీకెండ్ ముగియకముందే ఆదివారం కూడా సినిమా అత్యధిక వసూళ్లతో దూసుకెళ్ళింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఆదివారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 63.5 కోట్ల టోటల్ కలెక్షన్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రెండో వీకెండ్ ముగిసే సరికి సినిమా టోటల్ గా రూ. 112.50 కోట్ల దాకా వసూలు చేసి సత్తా చాటుకుంది.
సినిమా కథ, స్క్రీన్‌ప్లే, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ నటనతో పాటు, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహార్, జార్జ్ మారియన్, కె.ఎస్.రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ వంటి నటుల పర్ఫార్మెన్స్‌ను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ‘డ్రాగన్’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా, యువతరానికి కనెక్ట్ అయ్యేలా అశ్వంత్ మారిముత్తు తెరకెక్కించారని సినీ విశ్లేషకులు అంటున్నారు