‘రెట్రో’ రన్ టైమ్ ఎంతో తెలుసా?
ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. మొత్తం రన్‌టైమ్ 168 నిమిషాలు (2 గంటలు 48 నిమిషాలు) గా ఫిక్స్ అయ్యింది.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.
ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. మొత్తం రన్‌టైమ్ 168 నిమిషాలు (2 గంటలు 48 నిమిషాలు) గా ఫిక్స్ అయ్యింది. ఇది కొంచెం ఎక్కువగా అనిపించినా.. స్క్రీన్‌ప్లే బాగుంటే నిడివి సమస్య కాదని అంటున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘పేట, జిగర్తాండా డబుల్‌ఎక్స్’ సినిమాలకూ ఇదే తరహా నిడివి ఉంది.
ఇక ‘రెట్రో’ మూవీ థియేట్రికల్ ట్రైలర్.. ఆడియో విడుదల కానున్నాయి. ‘రెట్రో’ తో సూర్య చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని అందుకుంటాడా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ చిత్రంలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రలు పోషించారు. సూర్య, జ్యోతిక సంయుక్తంగా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.