24 ఏళ్ళ తర్వాత కోలీవుడ్ లోకి మళ్ళీ రవీనా
రవీనా టాండన్ తన కెరీర్‌లో పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. అయితే, ఆమె చివరిసారిగా తమిళ సినిమా 2001లో విడుదలైన ‘ఆలవంధన్’ (తెలుగులో ‘అభయ్’). ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సురేష్ కృష్ణ డైరెక్ట్ చేశారు.;
బాలీవుడ్ నిన్నటి తరం హీరోయిన్ రవీనా టాండన్ కు పరిచయం అవసరం లేదు. హిందీ సినిమాల్లో గొప్ప కెరీర్ తర్వాత... ఈ నటి దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కోలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. ‘మొహ్రా’ లాంటి సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ను ఒకప్పుడు తిరుగులేకుండా.. ఏలిన రవీనా టాండన్.. ఇప్పుడు విజయ్ ఆంటోనీ తదుపరి చిత్రం ‘లాయర్’ లో నటించనుందని ఇటీవల ప్రకటించారు.
‘లాయర్’ మూవీ డైరెక్టర్ జోషువా శేతురామన్.. రవీనాను ఎందుకు ఎంచుకున్నారో మీడియాతో మాట్లాడుతూ వివరించారు. “నాకు బాలీవుడ్‌లో మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ల ద్వారా రవీనాతో సంప్రదించాను. నా తొలి సినిమా ‘జెంటిల్‌వుమన్’ చూస్తే నా పనితీరు గురించి ఆమెకు ఐడియా వస్తుందని చెప్పాను. ఆ సినిమా చూసిన తర్వాత, నేను ఈ చిత్ర కథను ఆమెకు వివరించాను, ఆమెకు కథ నచ్చింది, ఆసక్తి చూపింది” అని అన్నారు.
రవీనా టాండన్ తన కెరీర్‌లో పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. అయితే, ఆమె చివరిసారిగా తమిళ సినిమా 2001లో విడుదలైన ‘ఆలవంధన్’ (తెలుగులో ‘అభయ్’). ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సురేష్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఇందులో కమల్ హాసన్, మనీషా కొయిరాలా, అను హాసన్, కిట్టూ గిడ్వానీ, శరత్ బాబు తదితరులు నటించారు. ఇటీవలి కాలంలో... రవీనా దక్షిణాది సినిమాల్లో కూడా గుర్తిండిపోయే పాత్రలు పోషించింది. ముఖ్యంగా యష్, సంజయ్ దత్‌లతో కలిసి నటించిన కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కేజీఎఫ్ : ఛాప్టర్ 2’లో ఆమె ప్రధానిమంత్రిగా నటించి మెప్పించింది.
రవీనా తదుపరిగా ‘హౌస్‌ఫుల్ 5’, ‘ఇన్ గలియోన్ మే’ అనే రెండు సినిమాల్లో నటించనుంది. ఇక విజయ్ ఆంటోనీ ‘లాయర్’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం భారత న్యాయవ్యవస్థపై దృష్టి సారిస్తూ, ఒక అసాధారణ కేసు చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందనుంది. మరి ‘లాయర్’ మూవీలో రవీనా పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో చూడాలి.