ముత్తువేల్ పాండియన్ హంట్ బిగిన్స్
By : Surendra Nalamati
Update: 2025-03-10 08:23 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’ బాక్సాఫీస్‌ను ఊపేసిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తోనే రజనీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ‘జైలర్‘కి కొనసాగింపుగా ‘జైలర్ 2‘ రూపొందుతుంది.
ఈరోజు ‘జైలర్ 2’ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ‘ముత్తువేల్ పాండియన్ హంట్ బిగిన్స్‘ అంటూ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘టైగర్ కా హుకుమ్’ అంటూ ‘జైలర్’లో హంగామా చేసిన రజనీ, ‘జైలర్ 2’లో మరింత పవర్‌ఫుల్ గా కనిపించనున్నాడట. ఫస్ట్ పార్ట్ కి మించిన రీతిలో సీక్వెల్ లో రజనీకాంత్ ఎలివేషన్స్ కి స్కోర్ ను డిజైన్ చేస్తున్నాడట రాక్ స్టార్ అనిరుధ్. ఇప్పటికే ‘జైలర్ 2‘ అనౌన్స్ మెంట్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.