తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టనున్న రజనీకాంత్.. కారణం ఇదే !
‘జైలర్’ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘జైలర్’కి ఇది సీక్వెల్ కావడంతో, రజినీ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ ఎక్సైట్‌మెంట్ నెలకొంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ‘కూలీ’ తుది దశకు చేరుకుంది. ఇక చివరి షెడ్యూల్‌ను వైజాగ్, హైదరాబాద్‌లలో ప్లాన్ చేసినట్లు సమాచారం. మార్చి నాటికి షూటింగ్ పూర్తిచేసేలా చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు, సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు టాక్. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది